సామర్థ్యాలు ఉపయోగించుకోవటం లేదా మరగు పరచటం మీ చేతుల్లోనే ఉంటుంది.

Monday, October 13, 2008

మీ నగదును సులభంగా బదలీ చేసుకోవడం ఎలా?.....ఇలా!

ఇప్పటివరకు మీరు మీ నగదును ఒకే బ్యాంక్ లోని వేర్వేరు ఖాతాలకు బదిలీ చేసుకొంటున్నారు . కాని ఇప్పుడు మీ యొక్క నగదును సులభంగా ఒక బ్యాంక్ లో ఒక ఖాతా నుండి మరొక బ్యాంక్ లో వేరొక ఖాతా కు బదిలీ చేసుకోవడానికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప్రవేశపెట్టిన రెండు పద్దతులే RTGS/NEFT . RTGS అనగా రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ మరియు NEFT అనగా నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫెర్ అని అర్థం.
RTGS పద్దతిలో మీరు పంపే నగదు యొక్క లావాదేవి మీ బ్యాంక్ వారు ప్రాసెస్ చేయగానే అది సెటిల్ అవుతుంది. అదే NEFT పద్దతిలో మీరు చేసిన లావాదేవీలు గుంపులుగా (batches) గా సెటిల్ అవుతాయి అదీ వారు ఇచ్చిన సమయానికే. ఉదాహరణకు NEFT లో మీ నగదు బదలీ యొక్క లావాదేవీలు ఒక రోజులో ఆరు సార్లు అంటే (9.30 a.m, 10.30 a.m, 12 noon, 1.00 p.m, 3 p.m, 4 p.m) అదే శనివారం అయితే మూడు సార్లు (9.30 a.m, 10.30 a.m, 12 noon) సెటిల్ చేయబతాయి. ఇంకా వివరంగా చెప్పాలంటే మీరు 9.30 తరువాత పంపిన లావాదేవీలు అన్నీ 10.30 కు మాత్రమే సెటిల్ చేయబతాయి. అలాగే 10.30 తరువాత పంపిన లావాదేవీలు అన్నీ 12 గంటలకు సెటిల్ చేయబతాయి. కాని RTGS లో లావాదేవీలు నిరంతరంగా సెటిల్ అవుతూ ఉంటాయి. RTGS ద్వారా మనము నగదు పంపడానికి కావలిసిన కనీస మొత్తం లక్ష రూపాయిలు. అదే NEFT ద్వారా అయితే కనీస మొత్తం అంటూ ఏమీ లేదు. ఎంతయినా మీరు పంపుకోవచ్చు. నగదు బదలీ చేయగోరేవారు బ్యాంక్ వారికి ఈ క్రింద తెలిపిన వివరాలు అందజేయవలసి ఉంటుంది.
  • పంపిచవలసిన నగదు మొత్తము.
  • డెబిట్ చేయవసిన అకౌంట్ నెంబరు.
  • నగదు చేరవలసిన బ్యాంక్ పేరు.
  • చేరవలసిన వ్యక్తి పేరు లేదా కంపెని పేరు.
  • చేరవలసిన వ్యక్తి లేదా కంపెని యొక్క అకౌంట్ నెంబరు.
  • చేరవలసిన బ్యాంక్ యొక్క IFSC కోడ్.
IFSC కోడ్ ను సంబధిత బ్యాంక్ వారిని అడిగి తెలుసుకోవచ్చు. ఇది బ్యాంక్ లో ప్రతీ శాఖకు వేర్వేరుగా ఉంటుంది. చాల బ్యాంక్ లు వారి యొక్క IFSC కోడ్ ను వారి యొక్క చెక్కు పుస్తకాల మీద ముద్రిస్తున్నాయి. ప్రస్తుతము అన్నీ బ్యాంకు శాఖలు ఈ సేవలను అందించడం లేదు. ఎ ఎ బ్యాంక్ శాఖలు ఈ సేవలను అందిస్తున్నాయో తెలుసుకోవడానికి www.rbi.org.in/scripts/bs_view RTGS.aspx ను దర్శించండి.
ఈ సేవలను మీకు అందించినందుకు గాను బ్యాంక్ వారు వసూలు చేసే ఖర్చులు (service charges) ఒకో బ్యాంక్ కు ఒకో విధంగా ఉంటాయి. బ్యాంకుల వారిగా వారు వసూలు చేసే ఖర్చుల వివరాలు తెలుసుకోవడానికి www.rbi.org.in ను దర్శించండి.
ఏదైనా కారణం చేత మీరు పంపిన నగదు మీరు పంపిన ఖాతా కు చేరని పక్షం లో మీరు పంపిన నగదు మీ ఖాతా కు తిరిగి జమ అవుతుంది. ఇద్దరికీ జమ కాని పక్షం లో మీరు మీ బ్యాంక్ శాఖ ను సంప్రదించండి. వారి యొక్క సమాధానం తో మీ సమస్య పరిష్కారం కాకపోతే మీరు క్రింద చిరునామా ను సంప్రదించండి.

NEFT

ది జనరల్ మేనేజర్
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా
నేషనల్ క్లియరింగ్ హౌస్
మొదటి అంతస్తు
నారిమన్ పాయింట్
ముంబై 400027

RTGS

చీఫ్ జనరల్ మేనేజర్
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా
కస్టమర్ సర్విస్ డిపార్టుమెంటు
మొదటి అంతస్తు , అమర్ బిల్డింగ్
ఫోర్ట్ , ముంబై - 400001.

పైన చెప్పిన రెండు పద్దతులలో ఇండియన్ రూపాయలు మాత్రమే బదలీ చేయబడతాయి . ఎ ఇతర కరన్సీ పంపబడదు.

ఎందుకింకా ఆలస్యం ఈ రోజు నుండి మీ నగదును సులభంగా బదలీ చేసుకోండి.



2 comments:

Shiva Bandaru said...

good information

syedrafiq said...

Sir,
Your Blog is very good,please continue your blog related to Bank terms