
- మీరు శారీరకంగా అందంగా లేకపోతే దాన్ని మీ వ్యక్తిత్వంతో భర్తీ చేయండి.
- మీ చుట్టూవున్న విషాదంలోంచి బయటకు మెదట అడుగు మీరు వేయండి. తరువాత మిమ్మల్ని ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రేమిస్తారో, చూడండి. మీరే మూర్తీభవించిన విషాదమైతే, మీ చుట్టూ మరికొన్ని విషాదాలు మనుష్యుల రూపం లో చేరతాయి.
- అపజయంవల్ల వెంటనే కలిగేది క్రుంగిపోవడం . అది - కోపం, నిస్సహాయత, అవమానం, నిర్వీర్యతగా పరావర్తనం చెందక ముందే దాన్ని "పట్టుదల" గా మార్చుకోండి.
- మీరేదో సాధించటానికి పుట్టారు. అదేమిటో ముందు కనుక్కోండి. దాన్ని సాధించడానికి ప్రయత్నాలు ప్రారంభించండి. దానికి మీలో ఉండే అంతర్గత శక్తుల సహాయం తీసుకోండి.
- మీ బాధల్ని చూసి మీరు బాధపడకండి. మీ మీద మీరు జలిపడకండి. పడ్డా, అది మొహంలో చూపించకండి.
- ప్రేమ గొప్పదే. కాని దానికోసం చనిపోవల్సినంత గోప్పదికాడు. ఈ ప్రపంచంలో ప్రేమకోసం చావకండి. దాన్ని పంచండి.
- మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడకపోతే అది వారి సమస్య మీ సమస్య కాదు.
- ఇతరులు మీతో రోజుకి గంటో, రెండు గంటలో గడపొచ్చు. కాని మీతో మీరు ఇరవై నాలుగు గంటలు గడపాలి. కాబట్టి మీ కంపెనీ మీకు ఆహ్లాదకరంగా ఉండేలా చూసుకోండి.
- సలహాలు ఇతరులను ఇవ్వనివ్వండి. నిర్ణయాలు మీరు తీసుకోండి.
- మీరు 'సరైనది' అనుకున్న పని చేయండి. చాల మంది విమర్శిస్తారు. కొంతమంది మెచ్చుకుంటారు. కాని అ....తి కొద్దిమంది మాత్రమే "చేస్తారు".
- చేసేవాళ్ళు కొద్దిమందే ఉంటారు. చూసేవాళ్ళు చాలామంది ఉంటారు.
- ఇంకొకరి విషాదానికి మీరు పోస్ట్ మాన్ కాకండి.
- సినిమా గానీ, సిగరెట్ గానీ, రొమాన్స్ గానీ మీకు ఆనందం ఇవ్వలే తప్ప, మిమ్మల్ని ఆడించకూడదు.
- చివరగా - పదమూడు చెడ్డ సంఖ్య లాంటి మూర్ఖపు అభిప్రాయాలను వదిలి పెట్టండి. పిల్లి ఒక జంతువు. తుమ్ము ఒక అసంకల్పిత శారీరక ప్రక్రియ.
(మూలం : 'యండమూరి' - విజయం వైపు పయనం )
7 comments:
బాగుందండి మీ సంకలనం.
మంచిని అందించినందుకు ధన్యవాదములు
good post.
You are incitement me with your post. THANK YOU Sir. Keep going
uncle mee post chaalaa baagundhi . asalu mee blog lo annee baagunnay.
గుడ్. Iam also great fan of Yendamuri. Nice collection....
విజయ సూత్రాలు బాగానే ఉన్నాయి. కాని యండమూరీ గారు వారి విజయ సూత్రాలు చిరంజీవి సినిమా 'స్టువార్టుపురం పోలీస్ స్టేషన్' సినిమాకి వాడి ఉంటే.. బాగుండేది.. వాడక పోబట్టే వారిని దర్శకుడిగా పీకి పారేశారు. వారు లేకుండానే ఫారిన్ లో పాటలు చిత్రీకరించారు. ఎంత pity?? (గుర్తు తెచ్చుకోండి అలనాటి 'శివరంజని' సెంటర్ స్ప్రెడ్ లో వారి interview).
Post a Comment