సామర్థ్యాలు ఉపయోగించుకోవటం లేదా మరగు పరచటం మీ చేతుల్లోనే ఉంటుంది.

Sunday, September 28, 2008

ఆలోచించండి

సాక్షి దిన పత్రికలో యండమూరి వీరంద్రనాథ్ గారు వ్రాస్తున్న భేతాళ ప్రశ్నలు శీర్షిక మీలో చాలమంది చదివే ఉంటారు. దీనిలో యండమూరి గారు వ్రాసే ప్రశ్నలు పిల్లల్ని, పెద్దల్ని ఆలోచింపచేసే విధంగా ఉన్నాయి. ఒకవేళ మీరు శీర్షిక చదివిఉంటే .కే లేకపోతే మాత్రం ఒకసారి చదివి ఆలోచించండి లేదా మీ పిల్లలకు చెప్పి ఆలోచింపచేయండి.
ప్రశ్న : "పాండవులని సమూలంగా నాశనం చెయ్యటానికి కౌరవులు పన్నిన పన్నాగమే లక్క ఇల్లు. ఒకసారి మంట పెడితే, గంటలో మొత్తం దగ్ధమయ్యేలా దాన్ని మయుడు నిర్మించాడు. ఐతే, పాండవులపై ప్రేమచేత దానికి ఒక సొరంగ మార్గం కూడా ఏర్పాటు చేసాడు. అనుకున్నట్లుగానే పాండవులు నిద్రిస్తున్న సమయాన కౌరవులు లక్క ఇంటిని తగలబెట్టారు. నాలుగు వైపులనుంచీ మంటలు వ్యాపించాయి. నకులుడు చురుకైనవాడు. మిగతా నలుగురినీ సొరంగ ద్వారం వద్దకు చేర్చాడు. ఐతే ఇక్కడ ఒక చిక్కు వచ్చింది.
ఎన్నో మెలిక తిరిగిన అయా సొరంగంలో అక్కడక్కడా లోతైన గుంతలున్నాయి. దారి అస్తవ్యస్తంగా ఉంది. కాగడా లేకుండా అందుగుండా ప్రయాణం చయడం అసంభవం. చిమ్మ చీకటిలో వారివద్ద ఒకే కాగడా ఉన్నది. అది కేవలం గంటసేపు మాత్రమే వెలుగుతుంది. మరొక చిక్కు ఏమిటంటే - సన్నటి సొరంగం గుండా, ఒక సమయానికి ఇద్దరు కన్నా ఎక్కువ ప్రయాణం చెయ్యలేరు. మరో విధంగా చెప్పాలంటే ఒకరు కాగడా పట్టుకుని మరొకర్ని అటువైపు దింపి వెనక్కి వచ్చి మరొకర్ని తీసుకు వెళ్ళాలి అన్నమాట . విధంగా ఒకరు అటూ ఇటూ నాలుగుసార్లు ప్రయాణం చేస్తే , ఐదుగురూ అవతలవైపుకి చేరుకుంటారు. నకుల సదేవులు చురుకైనవారు . వారికి అటువైపు వెళ్ళటానికి ఐదు నిముషాలు పడుతుంది. అర్జునుడు నడవటానికి పది. స్తూలకాయుడైన భీముడు వెళ్ళడానికి ఇరవై నిముషాలు, వయసులో కాస్త వృద్ధుడైన ధర్మరాజుకి పాదిక నిముషాలు పడతాయి. ఐదుగురూ అటువైపు చేరుకోటానికి మొత్తం ఎంతసేపు పడుతుంది?
(సమాధానం కూసం వెళ్ళే ముందు మీరూ ఆలోచించండి.)

సమాధానం: నకులుడు చురుకైనవాడే..! కాని నలుగుర్ని తీసుకెళ్ళే బాధ్యత అతడు తీసుకోవటం ద్వారా సమయం వృధా అవుతుంది. ధర్మరాజుని ఒకసారి, భీముడిని ఒకసారి తీసుకెళ్ళటానికి నలబై ఐదు నిముషాలు అవుతుంది. అలా కాకుండా, వారిద్దరిని కలిసి వెళ్ళమనటం ద్వారా పాతిక నిమిషాల్లో పని అయిపోతుంది కదా! అదే సమయస్ఫూర్తి!
నకుల సహదేవులు ముందు ఇటుగా వచ్చి (ఐదు) నకులుడు వెళ్లి (ఐదు) భీముడిని, ధర్మరాజుని ఇటు పంపి (ఇరవైఐదు) వారి వద్దనున్న కాగడా సహదేవుడు తీసుకొని (ఐదు) అర్జునుడిని తెచ్చి (పది) చివరిగా వెళ్లి (ఐదు) నకులుడితో కలిసి వస్తే (ఐదు) కాగడా ఆరిపోయే సమయానికి - అంటే అరవై నిమిషాల్లో ఐదుగురూ ఇటు చేరుకొని, అటు వైపు కౌరవులు ఎంతో కష్టపడి దానం వెచ్చించి కట్టిన లక్క ఇల్లు తగలబడిపోవటం గమననించవచ్చు.

2 comments:

చిన్నమయ్య said...

రామచంద్రరావు గారూ, బ్లాగోకానికి స్వాగతం.

"కలగూరగంప" అనే పేరుతో చిరపరిచయమైన ఇంకో బ్లాగు కూడా వుంది. మీ టపా శీర్షిక కూడా వారి మాట లాగే వుంది.

ఇక మీ టపాలో, గణితానికి సంబంధించిన విషయాన్ని పక్కనబెడితే, అన్న గారి శ్రీ "క్రి"ష్ణ పాండవీయం లో, కృష్ణుడి సలహా మేరకి భీముడే సొరంగం తవ్వి, లక్కింటికి నిప్పంటుకున్నప్పుడు, అందరినీ తన భుజబలంతో ప్రమాదానికావల చేరుస్తాడు. "మత్తు వదలరా, నిద్దుర ..." పాట గుర్తుండేవుంటుందికదా!

ఒకే పేరున్న వేర్వేరు బ్లాగర్లు, వేర్వేరు టపాలు నిర్వహించడం కద్దు. వేర్వేరు పేర్లున్న బ్లాగర్లు, ఒకే పేరున్న వేర్వేరు బ్లాగులని నిర్వహించడం కొత్తగా వుంది. కూడలి లో "వేర్వేరు" గా గుర్తించడం ఎలా?

మరోసారి మీకు స్వాగతం. అభినందనలు.

Anonymous said...

ఏమీ అనుకోకపోతే మీ బ్లాగు పేరు మారిస్తే పాఠకులకి సదుపాయంగా ఉంటుందేమో. ఒక కలగూరగంపకి అలవాటు పడ్డాం కదా. ఆ బ్లాగులో టపాలేమో అనుకున్నాం, కూడలి లో మీ టపాలు చూసి. (మీరు పేరు మార్చినా మీ టపాలన్నీ చూస్తామని హామీ ఇస్తున్నాను.)