సామర్థ్యాలు ఉపయోగించుకోవటం లేదా మరగు పరచటం మీ చేతుల్లోనే ఉంటుంది.

Thursday, September 20, 2012

అధిక వడ్డీ రేట్లతో ఊరిస్తున్న ఎన్ సి డి లు

 ఈ మధ్య కాలంలో పలు కంపెనీలు వ్యాపార విస్తరణ పథకాలకు కావలసిన నిధుల సమీకరణ కోసం నాన్ కన్వర్టబుల్ డిబెంచెర్ల ను (ఎన్ సి డి లను ) జారీ చేస్తున్నాయి. ఎన్ సి డి లను చాలావరకు బ్యాంకిగేతర ఫైనాన్సు కంపెనీలు జారీ చేస్తున్నాయి.
ఎన్ సి డి లంటే  ఆ కంపెనీలు జారి చేసే రుణ పత్రాలు. వీటిని నేరుగా షేర్లుగా మార్పిడి చేసుకొనే వీలుండదు. అలా మార్పిడి చేసుకోదగిన రుణ పత్రాల (కన్వర్టబుల్ డిబెంచెర్ల) కన్నా వీటికి వడ్డీ రేటు కాస్తంత ఎక్కువ ఉంటుంది. ఈ వడ్డీ రేట్లు  వివిధ నిర్దిష్ట కాలపరిమితి (లాకిన్ పిరియడ్) ని బట్టి 11.50 శాతం నుండి 12.75 శాతం వరకు ఉండటం గమనర్హం. కంపెనీలు ఆమోదం లభించిన మేరకు నిర్దిష్ట మొత్తంలో నిధుల సమీకరణకు ఎన్ సి డి లను జారీ చేస్తాయి. ఒకవేళ మదుపరుల నుండి మంచి మద్దతు లభించిన పక్షంలో నిర్దిష్ట మొత్తం కన్నా అదనంగా అందిన సొమ్మును కూడా అట్టిపెట్టుకోవడానికి అవకాసం ఉంటుంది. ఈ వేసులుబాటునే గ్రీన్ షూ ఆప్షన్ అంటారు.
దీని వలన కంపెనీకి మరియు మదుపరులకి కూడా లాభాలు ఉన్నాయి.
కంపెనీకి: బ్యాంకుల రుణ రేట్లు అధికంగా ఉంటున్నాయి. రుణ లభ్యత ఇబ్బందికరంగా ఉంటుంది. దీనితో నిధుల సమీకరణకు ఎన్ సి డి ల వైపు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి.
ఐ పి ఓ ల ద్వారా నిధుల సమీకరణ అనేది జాప్యంతో కూడుకున్న పని.
కొన్ని ఎన్ సి డి ఇష్యులకు గడువు కన్నా ముందే చక్కటి ఆదరణ లభిస్తుంది. 
మదుపరులకి: వివిధ బ్యాంకుల డిపాజిట్ రేట్లు 10 శాతం లోపే ఉంటున్నాయి. వీటితో పోలిస్తే ఎన్ సి డి ల ఫై వడ్డీ రేట్లు  ఆకర్షణీయంగా ఉంటున్నాయి.
స్టాక్ మార్కెట్ లో మదుపు చేస్తే తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కోవలసి వస్తుంది. ఆ కోణం నుండి చూస్తె ఎన్ సి డి లు స్థిర ఆదాయాన్ని ఇస్తాయి.
ఎన్ సి డి లకు స్టాక్ ఎక్సెంజి లలో  నమోదు సదుపాయాన్ని పలు కంపెనీలు కల్పిస్తున్నాయి. దీనితో అవసరమైతే వీటిని విక్రయించి నగదుగా మార్చుకొనే అవకాసం ఉంటుంది.
ఎన్ సి డి ల పెట్టుబడి పెట్టేముందు ఇవి గమనించండి.
ఎన్ సి డి లను జారి చేసే కంపెని ఆర్ధిక పునాదుల గురించి, పనితీరు గురించి తెలుసుకొని మరీ పెట్టుబడి పెట్టటం మంచింది.
ఎక్కువ వడ్డీ గురించి ఆలోచించి ప్రలోభ పడే కంటే, ఆయా సంస్థలకు మెరుగైన పరపతి రేటింగ్ (credit rating) ఉందా, సదరు కంపెని యాజమాన్యం రికార్డ్, సమీకరించే నిధులను ఏ విధంగా వెచ్చిస్తుంది వంటివి పరిశీలించాలి. ఈ ప్రమాణాల పరంగా సంతృప్తి ని కలిగించే కంపెనీలే అని తేల్చుకున్న ఇష్యు లను మాత్రమె ఎంపిక చేసుకోవాలి.
ఒకవేళ గడువు కన్నా ముందే స్టాక్ ఎక్సెంజిలలో ఎన్ సి డి లను విక్రయించ దలిస్తే, వాటి మార్కెట్ విలువ ప్రకారం ప్రతిఫలం గిడుతుంది. కేటాయింపు జరిగిన తేది నుంచి ఒక ఏడాది లోపల ఎన్ సి డి లను విక్రయిస్తే మూలధన ప్రయోజనాల పన్ను చెల్లించవలసి ఉంటుంది.
నాన్ కన్వర్టబుల్ డిబెంచెర్ల  కన్నా కన్వర్టబుల్ డిబెంచెర్లు మేలైనవి. ఎందుకంటే, వీటిని షేర్లు గా మార్పిడి చేసుకొనే సౌలభ్యం ఉంటుంది.
ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న వివిధ సంస్థల ఎన్ సి డి ఇష్యు లు 
 కంపెని                                              ఎంత లక్ష్యం             ఇష్యు తేదీలు
శ్రీరామ్ సిటి యునియన్ ఫైనాన్సు        250 కోట్లు               సెప్టెంబర్ 12-26
రేలిగేర్ ఫిన్వేస్ట్                                       250 కోట్లు               సెప్టెంబర్ 14-27
ముత్తూట్ ఫైనాన్సు                               250 కోట్లు     సెప్టెంబర్ 17- Oct.5th

No comments: