సామర్థ్యాలు ఉపయోగించుకోవటం లేదా మరగు పరచటం మీ చేతుల్లోనే ఉంటుంది.

Wednesday, October 3, 2012

100 రూపాయలకే 4 లక్షల ప్రమాద భీమా (SBI General Insurance)


SBI జనరల్ ఇన్సూరెన్స్ వారి వ్యక్తిగత ఇన్సూరెన్స్ పాలసీ ద్వార కేవలం సంవత్సరమునకు 100 రూపాయల అత్యల్ప ప్రీమియం తో నాలుగు లక్షల వరకు ప్రమాద భీమా కల్పిస్తున్నారు.

ఈ పాలసీ తీసుకోవడానికి మీకు కావలిసిన అర్హతలు:
  • వయస్సు 18 నుండి 65 సంవత్సరాల మద్య ఉండాలి.
  • SBI లో సేవింగ్స్ ఖాతా ఉండి ఉండాలి. లేకపోయినట్లయితే క్రొత్త ఖాతా తెరుచుకోవచ్చు.
  • ప్రీమియం : 100 రూపాయలు (service tax తో కలిపి)
  • భీమా మొత్తం : 4 లక్షల రూపాయలు.
  • పాలసీ ప్రత్యేకత : ప్రమాదవశాత్తు సంభవించే ప్రాణ నష్టానికి భీమా.
మరిన్ని వివరాలకి సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు: 1800 22 1111,  1800 102 1111
                                                                     
లేదా మీ దగ్గర లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ బ్రాంచి ని సంప్రదించండి.       

Friday, September 28, 2012

ఆరోగ్యవంతమైన జుట్టు కోసం తీసుకోవలసిన ఆహారం

ఆరోగ్యవంతమైన జుట్టు కావాలనుకొంటున్నారా ఐతే  ఈ ఆహారం తీసుకోండి.
  1. అవిసె గింజలను నానబెట్టిన ఒక గ్లాస్ నీటిని ఉదయాన్నే పరగడుపుతో (empty stomach) త్రాగండి. దీనిలో ఉండే ఒమేగా 3 యాసిడ్ మీ జుట్టు పెరుగుదలకు ఎంతగానో  తోడ్పడుతోంది .
  2. ప్రతిరోజూ రాత్రి 5 బాదం గింజలను నీటిలో నానబెట్టి ఉదయాన్నే పొర (skin) తీయకుండా తినండి.
  3. మీ మాడు మీద చర్మానికి మంచి పోషక ఆహరం కావాలి. దీని కోసం మీకు fluids ఎంతగానో  ఉపయోగపడతాయి. అందువల్ల వీలైనంత ఎక్కువ మజ్జిగ, నిమ్మ రసం మరియు కొబ్బరి నీరు తీసుకోండి. 
  4. ప్రతిరోజూ 8-10 గ్లాసుల నీరు త్రాగండి.
  5. 1 కప్పు మొలకెత్తిన విత్తనాలను తినండి. ఇవి మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచడమే కాదు మెరిసేలా చేస్తాయి.
  6. ప్రతిరోజూ గుడ్డు లేక చికెన్ మీ ఆహారం లో ఉండే విధంగా చూసుకోండి.
  7. టీ, కాఫీ లను త్రాగటం వీలైనంత తగ్గించండి.
  8. మెరుగైన ఫలితాల కోసం ఒక గ్లాసు పాలు త్రాగండి.
  9. మెంతులు నీటిలో నానబెట్టి రుబ్బిన చూర్ణాన్ని (paste) మీ మాడుకు బాగా పట్టించి అరగంట సేపు ఉంచి తలస్నానం చేయండి. ఇలా వారానికి ఒక్కసారైనా చేయండి. ఆరోగ్యవంతమైన మెరిసే కురులు మీ సొంతం.
  10. స్ట్రాబెరి , అరటి, యాపిల్ , మామిడి మరియు ద్రాక్ష లాంటి పండ్లను రొజూ  2 లేక 3 పండ్లను తినండి.

Thursday, September 20, 2012

అధిక వడ్డీ రేట్లతో ఊరిస్తున్న ఎన్ సి డి లు

 ఈ మధ్య కాలంలో పలు కంపెనీలు వ్యాపార విస్తరణ పథకాలకు కావలసిన నిధుల సమీకరణ కోసం నాన్ కన్వర్టబుల్ డిబెంచెర్ల ను (ఎన్ సి డి లను ) జారీ చేస్తున్నాయి. ఎన్ సి డి లను చాలావరకు బ్యాంకిగేతర ఫైనాన్సు కంపెనీలు జారీ చేస్తున్నాయి.
ఎన్ సి డి లంటే  ఆ కంపెనీలు జారి చేసే రుణ పత్రాలు. వీటిని నేరుగా షేర్లుగా మార్పిడి చేసుకొనే వీలుండదు. అలా మార్పిడి చేసుకోదగిన రుణ పత్రాల (కన్వర్టబుల్ డిబెంచెర్ల) కన్నా వీటికి వడ్డీ రేటు కాస్తంత ఎక్కువ ఉంటుంది. ఈ వడ్డీ రేట్లు  వివిధ నిర్దిష్ట కాలపరిమితి (లాకిన్ పిరియడ్) ని బట్టి 11.50 శాతం నుండి 12.75 శాతం వరకు ఉండటం గమనర్హం. కంపెనీలు ఆమోదం లభించిన మేరకు నిర్దిష్ట మొత్తంలో నిధుల సమీకరణకు ఎన్ సి డి లను జారీ చేస్తాయి. ఒకవేళ మదుపరుల నుండి మంచి మద్దతు లభించిన పక్షంలో నిర్దిష్ట మొత్తం కన్నా అదనంగా అందిన సొమ్మును కూడా అట్టిపెట్టుకోవడానికి అవకాసం ఉంటుంది. ఈ వేసులుబాటునే గ్రీన్ షూ ఆప్షన్ అంటారు.
దీని వలన కంపెనీకి మరియు మదుపరులకి కూడా లాభాలు ఉన్నాయి.
కంపెనీకి: బ్యాంకుల రుణ రేట్లు అధికంగా ఉంటున్నాయి. రుణ లభ్యత ఇబ్బందికరంగా ఉంటుంది. దీనితో నిధుల సమీకరణకు ఎన్ సి డి ల వైపు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి.
ఐ పి ఓ ల ద్వారా నిధుల సమీకరణ అనేది జాప్యంతో కూడుకున్న పని.
కొన్ని ఎన్ సి డి ఇష్యులకు గడువు కన్నా ముందే చక్కటి ఆదరణ లభిస్తుంది. 
మదుపరులకి: వివిధ బ్యాంకుల డిపాజిట్ రేట్లు 10 శాతం లోపే ఉంటున్నాయి. వీటితో పోలిస్తే ఎన్ సి డి ల ఫై వడ్డీ రేట్లు  ఆకర్షణీయంగా ఉంటున్నాయి.
స్టాక్ మార్కెట్ లో మదుపు చేస్తే తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కోవలసి వస్తుంది. ఆ కోణం నుండి చూస్తె ఎన్ సి డి లు స్థిర ఆదాయాన్ని ఇస్తాయి.
ఎన్ సి డి లకు స్టాక్ ఎక్సెంజి లలో  నమోదు సదుపాయాన్ని పలు కంపెనీలు కల్పిస్తున్నాయి. దీనితో అవసరమైతే వీటిని విక్రయించి నగదుగా మార్చుకొనే అవకాసం ఉంటుంది.
ఎన్ సి డి ల పెట్టుబడి పెట్టేముందు ఇవి గమనించండి.
ఎన్ సి డి లను జారి చేసే కంపెని ఆర్ధిక పునాదుల గురించి, పనితీరు గురించి తెలుసుకొని మరీ పెట్టుబడి పెట్టటం మంచింది.
ఎక్కువ వడ్డీ గురించి ఆలోచించి ప్రలోభ పడే కంటే, ఆయా సంస్థలకు మెరుగైన పరపతి రేటింగ్ (credit rating) ఉందా, సదరు కంపెని యాజమాన్యం రికార్డ్, సమీకరించే నిధులను ఏ విధంగా వెచ్చిస్తుంది వంటివి పరిశీలించాలి. ఈ ప్రమాణాల పరంగా సంతృప్తి ని కలిగించే కంపెనీలే అని తేల్చుకున్న ఇష్యు లను మాత్రమె ఎంపిక చేసుకోవాలి.
ఒకవేళ గడువు కన్నా ముందే స్టాక్ ఎక్సెంజిలలో ఎన్ సి డి లను విక్రయించ దలిస్తే, వాటి మార్కెట్ విలువ ప్రకారం ప్రతిఫలం గిడుతుంది. కేటాయింపు జరిగిన తేది నుంచి ఒక ఏడాది లోపల ఎన్ సి డి లను విక్రయిస్తే మూలధన ప్రయోజనాల పన్ను చెల్లించవలసి ఉంటుంది.
నాన్ కన్వర్టబుల్ డిబెంచెర్ల  కన్నా కన్వర్టబుల్ డిబెంచెర్లు మేలైనవి. ఎందుకంటే, వీటిని షేర్లు గా మార్పిడి చేసుకొనే సౌలభ్యం ఉంటుంది.
ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న వివిధ సంస్థల ఎన్ సి డి ఇష్యు లు 
 కంపెని                                              ఎంత లక్ష్యం             ఇష్యు తేదీలు
శ్రీరామ్ సిటి యునియన్ ఫైనాన్సు        250 కోట్లు               సెప్టెంబర్ 12-26
రేలిగేర్ ఫిన్వేస్ట్                                       250 కోట్లు               సెప్టెంబర్ 14-27
ముత్తూట్ ఫైనాన్సు                               250 కోట్లు     సెప్టెంబర్ 17- Oct.5th

Wednesday, September 19, 2012

అధిక రక్తపోటును అదుపులో పెట్టడం ఎలా?

మీరు అధిక రక్తపోటు తో బాధ పడుతున్నట్లయితే మీ జీవన విధానం లో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా దానిని అదుపులో పెట్టవచ్చు. ఈ కొన్ని చిట్కాలను పాటించడం వలన మీ రక్తపోటు ను మీరు అదుపులో పెట్టుకోవచ్చు.
  • ఆరోగ్యకరమైన బరువు ఉండేలా చూసుకోండి. మీరు కాని ఊబ/స్థూలకాయము తో ఉన్నట్లయితే మీకు ఈ రక్తపోటు ముప్పు పొంచి ఉన్నట్లే. అందువల్లు సరైన BMI ఉండే విధంగా చూసుకోండి. BMI 25 లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నా లేక నడుము కొలతలు ఆడవాళ్ళకి 35 ఇంచ్ లు మగవారికి 40 ఇంచ్ లు పైబడి ఉంటె కనుక మీరు బరువు అధికంగా ఉన్నట్లు లెక్క. ఈ పై లక్షణాలు కనపడితే ముందుగా బరువు తగ్గటానికి ప్రాధాన్యత ఇవ్వండి.
  • ప్రతి రోజు తప్పనిసరిగా 30 నిముషాలు వ్యాయామము చేయడం అలవాటు చేసుకోండి.
  • తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మరియు క్రొవ్వు తీసిన పాల పదార్దాలు ఎక్కువగా తినండి.
  • వీలైనంత తక్కువ ఉప్పు తీసుకోండి (రోజుకు 1500 mg మించకుండా చూసుకోండి).
  •  ఆల్కహాల్ సేవించడం మానండి.
  • పొగ త్రాగటం మానండి. పొగాకు వాడే ఉత్పత్తులను వాడకండి. పొగాకు లో ఉండే నికోటిన్ మీ రక్తపోటు ను 10 mm Hg పెంచుతుంది. గమనించండి.
  • caffeine ఉండే శీతల పానీయాలను ఎక్కవుగా సేవించకండి .
  • డాక్టర్ గారి సలహాతో మీ రక్తపోటు ను మీరే స్వయంగా పర్యవేక్షించే ఏర్పాటు చేసుకోండి.
  • తరచూ డాక్టర్ గారిని కలిసి వారి సలహాలు సూచనలు పాటించండి.

Monday, September 17, 2012

నిద్రకు ఉపక్రమించే ముందు నీరు తప్పనిసరిగా త్రాగండి

మనకు వచ్చే 90% గుండె పోటులు తెల్లవారు ఝామున వస్తాయని మీకు తెలుసా? ఐతే ఈ గుండెపోటును రాకుండా కాపాడే ఒకే ఒక ఔషధం మంచినీరు. ప్రతి రోజు నిద్రకుపక్రమించే ముందు 1 లేదా 2 గ్లాసుల నీళ్ళు త్రాగటం వలన ఈ గుండె పోటులు నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. మంచినీటి ప్రాముఖ్యత గురించి మీ అందరికి  తెలుసు. కాని ఈ నీటిని ఒక ప్రత్యేకమైన సమయం లో తీసుకోవడం వలన కలిగే ఉపయోగాల గురించి మనం ఇప్పుడు చూద్దాం.

నిద్ర లేవగానే 2 గ్లాసుల నీరు - మీ అంతర్గత అవయవాలన్నిటిని ఉత్తేజపరుస్తుంది.
భోజనానికి 30 నిముషాల ముందు 1 గ్లాసు నీరు - మీ జీర్ణ శక్తి ని పెంపోదిస్తుంది.
స్నానానికి ముందు 1 గ్లాసు నీరు - మీ రక్తపోటు ను అదుపులో ఉంచుతుంది.
నిద్రకు ముందు 1 గ్లాసు నీరు - మీకు గుండెపోటు రాకుండా కాపాడుతుంది.

చూసారుగా నీటి యొక్క ఉపయోగాలు. సరైన సమయంలో మంచి నీటిని తీసుకోండి. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు.