ఆరోగ్యవంతమైన జుట్టు కావాలనుకొంటున్నారా ఐతే ఈ ఆహారం తీసుకోండి.
- అవిసె గింజలను నానబెట్టిన ఒక గ్లాస్ నీటిని ఉదయాన్నే పరగడుపుతో (empty stomach) త్రాగండి. దీనిలో ఉండే ఒమేగా 3 యాసిడ్ మీ జుట్టు పెరుగుదలకు ఎంతగానో తోడ్పడుతోంది .
- ప్రతిరోజూ రాత్రి 5 బాదం గింజలను నీటిలో నానబెట్టి ఉదయాన్నే పొర (skin) తీయకుండా తినండి.
- మీ మాడు మీద చర్మానికి మంచి పోషక ఆహరం కావాలి. దీని కోసం మీకు fluids ఎంతగానో ఉపయోగపడతాయి. అందువల్ల వీలైనంత ఎక్కువ మజ్జిగ, నిమ్మ రసం మరియు కొబ్బరి నీరు తీసుకోండి.
- ప్రతిరోజూ 8-10 గ్లాసుల నీరు త్రాగండి.
- 1 కప్పు మొలకెత్తిన విత్తనాలను తినండి. ఇవి మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచడమే కాదు మెరిసేలా చేస్తాయి.
- ప్రతిరోజూ గుడ్డు లేక చికెన్ మీ ఆహారం లో ఉండే విధంగా చూసుకోండి.
- టీ, కాఫీ లను త్రాగటం వీలైనంత తగ్గించండి.
- మెరుగైన ఫలితాల కోసం ఒక గ్లాసు పాలు త్రాగండి.
- మెంతులు నీటిలో నానబెట్టి రుబ్బిన చూర్ణాన్ని (paste) మీ మాడుకు బాగా పట్టించి అరగంట సేపు ఉంచి తలస్నానం చేయండి. ఇలా వారానికి ఒక్కసారైనా చేయండి. ఆరోగ్యవంతమైన మెరిసే కురులు మీ సొంతం.
- స్ట్రాబెరి , అరటి, యాపిల్ , మామిడి మరియు ద్రాక్ష లాంటి పండ్లను రొజూ 2 లేక 3 పండ్లను తినండి.
No comments:
Post a Comment