చారిటి కి 31 బిలియన్ డాలర్ ల విరాళాన్ని అందచేసి, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో రెండవ స్థానం లో ఉన్న వారెన్ బఫ్ఫెట్ తో CNBC ఛానల్ ఒక గంట ఇంటర్వ్యూ జరిపింది. దానిలో నుండి అతని జీవితం లో కొన్ని ఆసక్తికరమైన అంశాలను మీ కోసం పొందుపరుస్తున్నాను.
- వారెన్ బఫ్ఫెట్ మొదటి సారిగా షేర్ కొన్నప్పుడు అతని వయసు 11 సంవత్సరాలు. అయినప్పటికీ ఆయన షేర్ మార్కెట్ లోకి చాలా ఆలస్యముగా ప్రవేసించానని భావిస్తున్నారు.
- అతను న్యూస్ పేపర్ లు ఇంటింటా అందచేసి దాచుకొన్న డబ్బు తో చిన్న గుత్త పొలాన్ని(small farm) కొన్నప్పుడు అతని వయసు 14 సంవత్సరాలు.
- 50 సంవత్సరాల క్రితం పెళ్ళయిన తరువాత మిడ్ టౌన్ ఒహామ లో కొన్న త్రీ బెడ్రూం ఇంటిలోనే ఇప్పటికీ ఆయన నివసిస్తున్నారు. ఆ ఇంటిలోనే ఆయనకు కావలసినవన్నీ వున్నాయంటారు. ఆయన ఉండే ఇంటికి ప్రహారి గోడ గాని, ఫెన్సింగ్ గాని ఏమి లేవు.
- ఇప్పటికీ ఆయన కారుని ఆయనే డ్రైవ్ చేసుకుంటారు డ్రైవర్ సహాయం లేకుండా.
- ప్రపంచం లో అత్యంత ధనవంతుల్లో రెండవ స్థానం లో ఉన్న వారెన్ బఫ్ఫెట్ చుట్టూ ఎ సెక్యూరిటీ ఉండకపోవటం గమనార్హం.
- ప్రపంచం లో అతి పెద్దదైన ప్రైవేటు జెట్ కంపెని కి యజమాని అయినప్పటికీ, ప్రైవేటు జెట్ లో ఇప్పటికీ ఆయన ప్రయాణం చేయలేదు.
- దిశానిర్దేశం చేస్తూ ఆయన కంపెని లో CEO లకు సంవత్సరానికి ఒకే ఒక లెటర్ రాస్తారాయన. నియమబద్దంగా మీటింగ్ లు పెట్టటం గాని, ఫోన్ లు చేయడంకాని చేయరాయన. వారి CEO లకు రెండు రూల్స్ చెపుతారు. ఒకటి కంపెని లో ఇన్వెస్ట్ చేసే షేర్ హొల్దెర్స్ డబ్బుకు నష్టము తీసుకు రావద్దని. రెండవది మొదటి రూల్ ను మర్చిపోవద్దని.
- సమాజం లో పెద్ద పెద్ద వారితో స్నేహాలు ఉంటాయని అనుకుంటారంతా కాని ఆయన ఇంటికి వచ్చిన తరువాత పాప్ కార్న్ తయారుచేసుకోవడం, T.V చూడడం తో కాలక్షేపం చేస్తుంటారు.
- బిల్ గేట్స్ ఆయనను 5 సంవత్సరాల క్రితం మాత్రమె కలిసారు. బిల్ గేట్స్ , వారెన్ బఫ్ఫెట్ తో మీటింగ్ కోసం షెడ్యూల్ చేసుకొన్న టైం అరగంట. కాని ఆయన తో మీటింగ్ జరిపిన సమయం 10 గంటలు. తరువాత బిల్ గేట్స్ వారెన్ బఫ్ఫెట్ కు భక్తుని గా మారిపోయారు.
- ఇప్పటికీ బఫ్ఫెట్ తో సెల్ ఫోన్ ఉండదు. అతని డెస్క్ మీద కంప్యూటర్ ఉండదు.
- ఆయన యువత కి ఇచ్చిన సందేశాలు: క్రెడిట్ కార్డు లు వాడొద్దు. మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి.
- డబ్బు మనిషిని సృష్టించలేదు. మనిషే డబ్బుని సృష్టించాడని గుర్తుంచుకోండి.
- ఎంత నిరాడంబరంగా జీవించ గలిగితే అంత నిరాడంబరంగా జీవించండి.
- ఎదుటి వారు ఎం చెపితే అది చేయకండి. చెప్పింది వినండి. ఎలా చేయాలో నిర్ణయం మీరు తీసుకోండి.
- బ్రాండ్ నేమ్ తో మోసపోకండి. మీకు ఏది ధరిస్తే సౌకర్యం గ ఉంటుందో దానినే ఎన్నిక చేసుకోండి.
- అనవసరమైన వాటి మీద మీ డబ్బు వృధా చెయ్యకండి. అవసరమైన దానికే ఖర్చు చేయండి.
- ఇది మీ జీవితం. ఎదుటివారు మీ జీవితాన్ని శాసించే విధంగా ఉండకుండా చూసుకోండి.
- ఎదుటి వారు మిమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారనే భావన మీ అనుమతి లేకుండా మీలోకి రాదని మీరు గ్రహించండి. ఎదుటి వారి కన్నా మీరేమి తక్కువ కాదని గుర్తించండి.
4 comments:
బాగుందండి, తెలుగు లో అనువదించినందుకు నెస్సర్లు. నేను అందులో ఒక పాయింటు తు.చ తప్పకుండా పాటిస్తున్నా. అదే క్రెడిట్ కార్డులు లేకపోవడం
teliyani vishyayalani, telisela cheravesaaruuu...thanks andii..
చాలా మంచి విషయాలు సేకరించారు,ధన్యవాదాలు.
ఎంతో మందికి ఉఉపయోగ పడే మంచి విషయాలు అందించినందుకు మీకు అబినంధనలు .
Post a Comment