ఈ రోజు గాంధీ జయంతి. అంటే మన జాతిపిత మహాత్మా గాంధీ పుట్టిన రోజు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని సమాజ సేవ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయినా, కనీసం సమాజానికి మేలు చేసే టపా ఒకటి రాస్తే సమాజానికి మన వంతు సేవ చేసినట్టే అని భావిస్తూ ఈ టపా వ్రాస్తున్నాను.
ఆరోగ్యమే మహాభాగ్యం. అంటే ఆరోగ్యం ఉంటే అన్ని సంపదలు ఉన్నట్టేనని అర్థం. ఆరోగ్యం లేకపొతే మహారాజు కూడా ముష్టి వాడితో సమానం అంటారు పెద్దలు. దీనినిబట్టి ఆరోగ్యానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు. కాని మన ఆరోగ్యం కోసం మనం ఎంత సమయం కేటాయిస్తున్నాం ఒక సారి ఆలోచించండి. మన దైనందిన కార్యక్రమాల్లో అతి తక్కువ సమయం మనం మన ఆరోగ్యానికి కేటాయిస్తున్నాం. మనమే కాదు మన ప్రభుత్వం కూడా అంతే. మన బడ్జెట్ లో ఆరోగ్య రంగానికి కేటాయించే నిధులు ఏంటో తెలుసా? రెండు శాతం కంటే తక్కువ. దీనిపై చాల మంది ప్రముఖులు నెత్తి, నోరు బాదుకుంటున్నా పట్టించుకొనే నాధుడు లేడు.
మన శరీరం నాగరికత పెరిగిన దగ్గర నుండి రోజు రోజుకీ అనారోగ్యం వైపు దిగజారిపోతుంది. శరీరాన్ని బాగుచేయడానికి రక రకాల వైద్య విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. కాని అందరం కోరుకొనే ఆరోగ్యం మాత్రం ఈ శరీరానికి అంది అందనట్లుగానే ఉంది. నేటి పరిస్తితి చూస్తే, వయసుతో నిమిత్తం లేకుండా, కష్టపడి పని చేసుకునేవారు, ఉద్యోగస్తులు అని బేధం లేకుండా, స్త్రీ , పురుష బేధం లేకుండా, చదువుకున్నవారు, చదువురానివారు అని లేకుండా, డాక్టర్లు, యాక్టర్లు అని బేధం లేకుండా అందర్నీ అనారోగ్యం సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. ఇక అవయవాల పనితీరు చూస్తే చిన్న చిన్న పిల్లలకే కంటి చూపు తగ్గిపోతుంది. వయస్సు తో నిమిత్తం లేకుండా కీళ్ళు అరిగిపోతున్నాయి. స్త్రీలకు అండకోశాలు ఉంటున్నాయి కాని అండోత్పత్తి సరిగా జరగడం లేడు. పురుషులకు వీర్యం ఉంటున్నది కాని అందులో పనికివచ్చే వీర్యకణాలు మాత్రం తగ్గిపోతున్నాయి. థైరాయిడ్ గ్రంధి థైరాయిడ్ హార్మోనులను ఉత్పత్తి చేయలేక పోతున్నది. పాంక్రియాస్ గ్రంధి ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోవడం వలన వయసు తో నిమిత్తం లేకుండా షుగర్ వ్యాధి వచ్చేస్తుంది. బి.పి సర్వసాధారణం అయిపోయింది. పెళ్లి కాకముందే తెల్ల జుట్టు, పిల్లలు పుట్టక ముందే బట్టతల వచ్చేస్తున్నాయి. వీటికి తోడు కండరాలు, నరాల బలహీనతలు. ఇరవై ఏళ్లకే హార్టు బ్లాకులు, హృద్రోగాలు వస్తున్నాయి. ఈ మద్యన పిల్లలు పెద్దలు తేడ లేకుండా కనిపించే సమస్య స్థూలకాయం(ఒబేసిటీ). ఇలాంటి శరీరాలతో పనిచేయించుకోలేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఉదాహరణకు, తిన్నది అరగటానికి ఒక బిళ్ళ, అరిగింది బయటకు వెళ్ళటానికి ఇంకొక బిళ్ళ , గ్యాసు బయటకు పోవడానికి మరొక బిళ్ళ, అలాగే రక్తం పట్టడానికి, మంటలకు, నొప్పులకు, నిద్రకు ఇలా ఒకోరకం బాధకు ఒకో బిళ్ళ చొప్పున మందులను ఆహారంగా తింటున్నాము. ఇలా ఎంత కాలం పాటు? ఆలోచించండి! బాగా ఆలోచించండి.
ఇలా బ్రతకటం మీకు సుఖంగా ఉందా, లేదా మీ వల్ల ఎవరికన్నా సుఖంగా ఉంటున్నదా?
మరి జీవుడు ప్రయాణించే శరీరం అనే వాహనం బాగోపోతే, దానికి వచ్చే అడ్డంకులను పూర్తిగా తొలగించుకొని తిరిగి సుఖంగా ప్రయాణించే ప్రయత్నం మనం ఎందుకు చేయకూడదు? ఈ శరీరం పూర్తిగా బాగు కాదా? మీరు ప్రయత్నించాలే కాని సాధ్యం కానిది ఏముంటుంది? మనం అవకాసం ఇవ్వాలే కాని ఈ శరీరం ఎప్పుడైనా బాగు పడడానికి సిద్దంగా ఉంది. ఈ శరీరానికి పునర్నిర్మాణం చేసుకొని తిరిగి ఆరోగ్య వంతంగా తయారయ్యే ఆవకాశం పుట్టుక నుండే ఉంది. మీరు అది చెప్పినట్టు వింటూ దానికి కావలసినవి అందజేస్తే చాలు. ఇప్పటివరకు శరీరం మీరు చెప్పినట్టు వింది. కాని ఇప్పుడు రిపేరు వచ్చింది కాబట్టి అది చెప్పినట్టు మీరు వినాలి.
సరిగా పోషణ చెయ్యక పోతే మొక్కలు వాడిపోయి, ఆకులూ రాలిపోయి, కొమ్మలు ఎండిపోతాయి. అలాంటి మొక్కలకు, నేలను సరిగా దున్ని, కలుపు మొక్కలను తీసి, ఎరువు వేసి, పుష్కలంగా నీరు పోస్తే తిరిగి చక్కగా చిగురించి, పచ్చగా కళకళ లాడుతాయి. సరయిన ఆహారాన్ని అందిస్తే మోడుగా మారిన చెట్లే చిగురిస్తుంటే, ఈ మానవ శరీరం ఎందుకు ఎందుకు చిగురించదు? ఎందుకు బాగు పడదు? మీరు మనస్పూర్తిగా తలచుకొంటే తప్పక బాగుపడుతుంది. జీవించినంత కాలం శరీరం చెప్పినట్లుగా విని దాని అవసరాలను మీరు తీర్చండి మీ అవసరాలను అది తప్పక తీరుస్తుంది. ఇచ్చి పుచ్చుకోవడం నేర్చుకోండి.
శరీరానికి మంచి గతి పట్టాలంటే మనం ఎం తిని పెట్టాలో తెలుసుకోవడానికి వచ్చే టపా వరకు వేచిచూడాల్సిందే మరి.

2 comments:
మంచి ఆహారం ఎక్కడుందండి అంతా కల్తీమయం అయిపోయింది.పండించే అహారధాన్యాలన్నీ రసాయనిక ఎరువులతోనూ,హానికరమైన పురుగుమందులతో సమృద్ధమైనవే.పాలు చూస్తే అంతా oxitosin మయం.ఇలాంటి పరిస్థితిలో మన ఆరోగ్యం బాగుండమంటే ఎలా బాగుంటుంది.
ballsack
Post a Comment