సామర్థ్యాలు ఉపయోగించుకోవటం లేదా మరగు పరచటం మీ చేతుల్లోనే ఉంటుంది.

Friday, February 20, 2009

నెంబర్ వన్ లక్షణాలు

*తనకున్న కోరికలన్నీ తీర్చుకోగలిగేవాడు. కనీసం - కావాలనుకున్నప్పుడు ఈ వత్తిడీ లేకుండా , కావలసినంతసేపు నిద్ర పోగలిగేవాడు.
*తను కలవలుకున్న వారిని మాత్రమే కలవగలిగేవాడు లేదా తను మాత్రమే అప్పాయింట్మెంట్ ఇవ్వగలిగేవాడు.
*ఎవరినీ చూసి ఈర్ష్య పడనివాడు.
*ఒక గమ్యాన్ని ఏర్పరుచుకొని, ఆ గమ్యాన్ని చేరుకోవడం కోసం పనిచేస్తూ, ఆ పనిలో ఆనందం పొందేవాడు.
*తన సమస్యని పరిష్కరించుకోవడంలో నిష్పాక్షికంగా, నిస్సంకోచంగా తన పట్ల తానే నిర్దాక్షిణ్యంగా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగే శక్తి ఉన్నవాడు.
*తన జీవితంలో బలహీనమైన క్షణాలు దాదాపు లేనివాడు.
ఇంతేనా ? ఇంట సింపులా? జీవితంలో ఎ ఆశయం లేకుండా పగలు రాత్రి గాడిదలా నిద్రపోయేవాడు నెంబర్ వన్నా? ఇటువంటివాడికి జ్వరం వస్తే డాక్టరు కూడా అప్పాయింట్మెంట్ తీసుకొని వాడి దగ్గరికి రావాలా?వీడు మాత్రం అక్కడికి వెళ్ళడ? .................... ఇటువంటి ప్రశ్నల బాణాల వర్షం కురిపించకండి. పైకి ఎంతో తేలికగా, కొంచెం హాస్యాస్పదం గా కనిపించే పై అంశాల్ని సాధించడం అంతా సులభం కాదు.

4 comments:

Anonymous said...

You are right. Good one.

Srikar

Anonymous said...

This is from yandamuri's mindpower

Anonymous said...

ideology always speaks about impossible heights. no one can have any of these things to a full extent.

రామచంద్రరావు said...

yes these lines are extracted from yandamoori's mind power