సామర్థ్యాలు ఉపయోగించుకోవటం లేదా మరగు పరచటం మీ చేతుల్లోనే ఉంటుంది.

Saturday, October 25, 2008

నిరాడంబరత

చారిటి కి 31 బిలియన్ డాలర్ విరాళాన్ని అందచేసి, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో రెండవ స్థానం లో ఉన్న వారెన్ బఫ్ఫెట్ తో CNBC ఛానల్ ఒక గంట ఇంటర్వ్యూ జరిపింది. దానిలో నుండి అతని జీవితం లో కొన్ని ఆసక్తికరమైన అంశాలను మీ కోసం పొందుపరుస్తున్నాను.
  • వారెన్ బఫ్ఫెట్ మొదటి సారిగా షేర్ కొన్నప్పుడు అతని వయసు 11 సంవత్సరాలు. అయినప్పటికీ ఆయన షేర్ మార్కెట్ లోకి చాలా ఆలస్యముగా ప్రవేసించానని భావిస్తున్నారు.
  • అతను న్యూస్ పేపర్ లు ఇంటింటా అందచేసి దాచుకొన్న డబ్బు తో చిన్న గుత్త పొలాన్ని(small farm) కొన్నప్పుడు అతని వయసు 14 సంవత్సరాలు.
  • 50 సంవత్సరాల క్రితం పెళ్ళయిన తరువాత మిడ్ టౌన్ ఒహామ లో కొన్న త్రీ బెడ్రూం ఇంటిలోనే ఇప్పటికీ ఆయన నివసిస్తున్నారు. ఆ ఇంటిలోనే ఆయనకు కావలసినవన్నీ వున్నాయంటారు. ఆయన ఉండే ఇంటికి ప్రహారి గోడ గాని, ఫెన్సింగ్ గాని ఏమి లేవు.
  • ఇప్పటికీ ఆయన కారుని ఆయనే డ్రైవ్ చేసుకుంటారు డ్రైవర్ సహాయం లేకుండా.
  • ప్రపంచం లో అత్యంత ధనవంతుల్లో రెండవ స్థానం లో ఉన్న వారెన్ బఫ్ఫెట్ చుట్టూ ఎ సెక్యూరిటీ ఉండకపోవటం గమనార్హం.
  • ప్రపంచం లో అతి పెద్దదైన ప్రైవేటు జెట్ కంపెని కి యజమాని అయినప్పటికీ, ప్రైవేటు జెట్ లో ఇప్పటికీ ఆయన ప్రయాణం చేయలేదు.
  • దిశానిర్దేశం చేస్తూ ఆయన కంపెని లో CEO లకు సంవత్సరానికి ఒకే ఒక లెటర్ రాస్తారాయన. నియమబద్దంగా మీటింగ్ లు పెట్టటం గాని, ఫోన్ లు చేయడంకాని చేయరాయన. వారి CEO లకు రెండు రూల్స్ చెపుతారు. ఒకటి కంపెని లో ఇన్వెస్ట్ చేసే షేర్ హొల్దెర్స్ డబ్బుకు నష్టము తీసుకు రావద్దని. రెండవది మొదటి రూల్ ను మర్చిపోవద్దని.
  • సమాజం లో పెద్ద పెద్ద వారితో స్నేహాలు ఉంటాయని అనుకుంటారంతా కాని ఆయన ఇంటికి వచ్చిన తరువాత పాప్ కార్న్ తయారుచేసుకోవడం, T.V చూడడం తో కాలక్షేపం చేస్తుంటారు.
  • బిల్ గేట్స్ ఆయనను 5 సంవత్సరాల క్రితం మాత్రమె కలిసారు. బిల్ గేట్స్ , వారెన్ బఫ్ఫెట్ తో మీటింగ్ కోసం షెడ్యూల్ చేసుకొన్న టైం అరగంట. కాని ఆయన తో మీటింగ్ జరిపిన సమయం 10 గంటలు. తరువాత బిల్ గేట్స్ వారెన్ బఫ్ఫెట్ కు భక్తుని గా మారిపోయారు.
  • ఇప్పటికీ బఫ్ఫెట్ తో సెల్ ఫోన్ ఉండదు. అతని డెస్క్ మీద కంప్యూటర్ ఉండదు.
  • ఆయన యువత కి ఇచ్చిన సందేశాలు: క్రెడిట్ కార్డు లు వాడొద్దు. మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి.
  • డబ్బు మనిషిని సృష్టించలేదు. మనిషే డబ్బుని సృష్టించాడని గుర్తుంచుకోండి.
  • ఎంత నిరాడంబరంగా జీవించ గలిగితే అంత నిరాడంబరంగా జీవించండి.
  • ఎదుటి వారు ఎం చెపితే అది చేయకండి. చెప్పింది వినండి. ఎలా చేయాలో నిర్ణయం మీరు తీసుకోండి.
  • బ్రాండ్ నేమ్ తో మోసపోకండి. మీకు ఏది ధరిస్తే సౌకర్యం గ ఉంటుందో దానినే ఎన్నిక చేసుకోండి.
  • అనవసరమైన వాటి మీద మీ డబ్బు వృధా చెయ్యకండి. అవసరమైన దానికే ఖర్చు చేయండి.
  • ఇది మీ జీవితం. ఎదుటివారు మీ జీవితాన్ని శాసించే విధంగా ఉండకుండా చూసుకోండి.
  • ఎదుటి వారు మిమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారనే భావన మీ అనుమతి లేకుండా మీలోకి రాదని మీరు గ్రహించండి. ఎదుటి వారి కన్నా మీరేమి తక్కువ కాదని గుర్తించండి.

Wednesday, October 22, 2008

అత్యంత ఖరీదైన పుస్తకం

1455 సంవత్సరం జాన్ గూటాన్ బర్గ్ అనే జర్మన్ దేశీయుడు మొట్టమొదటి సారిగా అచ్చు యంత్రాన్ని ఉపయోగించి పుస్తకాన్ని ముద్రించాడు. అప్పట్లో ఆయన 200 ప్రతుల బైబిల్ ను ముద్రించాడు. దానిలో రోజుకి ఉన్న ప్రతుల సంఖ్య 21. వీటిలో ఒక దానిని 1978 సంవత్సరం లో వేలం వేయగా ఎంతకు అమ్ముడు పోయిందో మీకు తెలుసా? 24,00,000 డాలర్లకు . ఇదే అచ్చయిన పుస్తకాలలో అత్యంత ఖరీదైన పుస్తకం.

Tuesday, October 21, 2008

చరిత్ర పునరావృతం అయింది

అబ్రహాం లింకన్ కాంగ్రెస్ కు ఎన్నికైన సంవత్సరం 1846.
జాన్ ఎఫ్ కెన్నెడీ కాంగ్రెస్ కు ఎన్నికైన సంవత్సరం 1946.
అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన సంవత్సరం 1860.
జాన్ ఎఫ్ కెన్నెడీ ప్రెసిడెంట్ గా ఎన్నికైన సంవత్సరం 1960.
Lincoln మరియు Kennedy లో ఉన్న అక్షరాలు 7.
ఇద్దరూ "పౌర హక్కులు" తో సంబంధం ఉన్నవారే.
ఇద్దరూ వారి యొక్క పిల్లల్ని వైట్ హౌస్ లో ఉండగానే పోగొట్టుకొన్నారు.
ఇద్దరూ శుక్రవారం రోజునే హత్య చేయబడ్డారు.
ఇద్దర్ని వారి యొక్క భార్య సమక్షంలో, తలపై కాల్చి చంపబడ్డారు.
లింకన్ యొక్క సెక్రటరీ పేరు కెన్నెడీ.
కెన్నెడీ యొక్క సెక్రటరీ పేరు లింకన్.
ఇద్దరూ ప్రెసిడెంట్ లు southerners చే చంపబడ్డారు.
వారి ఇద్దరి మరణం తరువాత తిరిగి ప్రెసిడెంట్ పదవిని చేపట్టింది southerners.
లింకన్ మరియు కెన్నెడీ ల మరణానంతరం ప్రెసిడెంట్ పదవిని చేపట్టిన వారి ఇద్దరి పేర్లలో "జాన్సన్" ఉంది.
లింకన్ మరణానంతరం ప్రెసిడెంట్ పదవిని చేపట్టిన ఆండ్రూ జాన్సన్ పుట్టిన సంవత్సరం 1808.
కెన్నెడీ మరణానంతరం ప్రెసిడెంట్ పదవిని చేపట్టిన లిండన్ జాన్సన్ పుట్టిన సంవత్సరం 1908.
లింకన్ ను చంపిన జాన్ విల్కేస్ బూత్ పుట్టిన సంవత్సరం 1839.
కెన్నెడీ ను చంపిన లీ హర్వే ఒస్వల్డ్ పుట్టిన సంవత్సరం 1939.

Saturday, October 18, 2008

సర్దార్జీ జోకులు

ఇది తెలుగు బ్లాగ్ అయినప్పటికీ జోకులు ఇంగ్లీష్ లో చదివితేనే అర్థం మారకుండా మనకు బాగా నవ్వొస్తుంది అందుకే ఇంగ్లీష్ లో రాయడం జరిగింది. చదివి నవ్వుకోండి.

Prince Charles & Sardarji were having dinner.
Prince said, "Pass the wine you divine".
Sardar thinks "how poetic"
Sardar says, "pass the custard you bastard"..

************ ********* ********* ********* ********

Sardar at bar in New York .
Man on his right says "Johny Walker single"
Man on his left says "Peter Scotch single"
Sardar says - "Baljith Singh Married"

************ ********* ********* ********* ********

Boss : am giving u job as a driver. STARTING salary Rs.2000/-, is it o.k
Sardar : U R great sir! Starting salary is o.k........but? ?
how much is DRIVING salary...?

************ ********* ********* ********* ********

Sardar's theory : Moon is more impt than Sun, coz it gives light at
night when light is needed & Sun gives light during the day when light
is not needed!!!

************ ********* ********* ********* ********

2 sardars are driving a Car, one puts on the indicator and asks the
other to check whether its working, he puts his head out and says

YES...NO...YES. ...NO...YES. ..NO...

************ ********* ********* ********* ********

Sardar shouting 2 his girl friend " u said v will do register marriage
and cheated me, I was waiting 4 u yesterday whole day in the post
office....


************ ********* ********* ********* ********

A Tamilian call up sardar and asks " tamil therima??"
Sardar got mad, angrily replied.... "Hindi tera baap!!!"

************ ********* ********* ********* ********

2 sardarjis looking at Egyptian mummy.
Sar 1 : Look so many bandages, pakka lorry accident case.
Sar 2 : Aaho, lorry number is also written...BC 1760!!!....

************ ********* ********* ********* ********
A sardar on an interview 4 da post detective.
Interviewer : who killed Gandhi?
Sardar : Thank u sir 4 giving me d job, I will start investigating. .......

************ ********* ********* ********* ********
A sardar for an exam had studied only one essay 'FRIEND', but in the
exam the essay which came was 'FATHER' . he replaced friend with father
in the essay and>it read: AM A VERY FATHERLY PERSON, I HAVE LOTS OF FATHERS,
SOME OF MY FATHERS ARE MALE AND SOME ARE FEMALE. MY TRUE
FATHER IS MY NEIGHBOUR.

************ ********* ********* ********* ********
Interviewar: what s ur qualification?
Sardarji : Sir I am Ph.d.
Interviewar : what do u mean by Ph.d?
Sardarji : (smiling) PASSED HIGHSCHOOL with DIFFICULTY.. ...

************ ********* ********* ********* ********
Amitab : In which state Cauvery flows?
Sardar : liquid state.....
Audience clapped.. Amitab stunned, looks behind, ALL WERE SARDARS..... ...

*********** ********* ********* ********* ********

Friday, October 17, 2008

సచిన్ కు నా అభినందన మందారమాల

రోజు క్రికెట్ క్రీడాభిమానులకు పండగ రోజు. క్రికెట్ క్రీడాభిమనుల్లో చెరగని ముద్ర వేసుకున్న సచిన్ టెండూల్కర్ రోజు టెస్ట్ క్రికెట్ చరిత్ర లో అత్యధికమైన 11,953 పరుగులను ను అధిగమించి 12,000 పరుగులను సాధించి మన భారత జాతి సగర్వంగా తల పైకి ఎత్తుకునేల చేసాడు. యావత్ ప్రపంచం ఒక్కసారి మన భారత దేశం వైపు చూసేలా మన దేశం యొక్క కీర్తి , ప్రతిష్టలను ఇనుమడింప చేసిన రన్డూల్కర్ కు నా అభినందన మందారమాల.

Monday, October 13, 2008

మీ నగదును సులభంగా బదలీ చేసుకోవడం ఎలా?.....ఇలా!

ఇప్పటివరకు మీరు మీ నగదును ఒకే బ్యాంక్ లోని వేర్వేరు ఖాతాలకు బదిలీ చేసుకొంటున్నారు . కాని ఇప్పుడు మీ యొక్క నగదును సులభంగా ఒక బ్యాంక్ లో ఒక ఖాతా నుండి మరొక బ్యాంక్ లో వేరొక ఖాతా కు బదిలీ చేసుకోవడానికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప్రవేశపెట్టిన రెండు పద్దతులే RTGS/NEFT . RTGS అనగా రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ మరియు NEFT అనగా నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫెర్ అని అర్థం.
RTGS పద్దతిలో మీరు పంపే నగదు యొక్క లావాదేవి మీ బ్యాంక్ వారు ప్రాసెస్ చేయగానే అది సెటిల్ అవుతుంది. అదే NEFT పద్దతిలో మీరు చేసిన లావాదేవీలు గుంపులుగా (batches) గా సెటిల్ అవుతాయి అదీ వారు ఇచ్చిన సమయానికే. ఉదాహరణకు NEFT లో మీ నగదు బదలీ యొక్క లావాదేవీలు ఒక రోజులో ఆరు సార్లు అంటే (9.30 a.m, 10.30 a.m, 12 noon, 1.00 p.m, 3 p.m, 4 p.m) అదే శనివారం అయితే మూడు సార్లు (9.30 a.m, 10.30 a.m, 12 noon) సెటిల్ చేయబతాయి. ఇంకా వివరంగా చెప్పాలంటే మీరు 9.30 తరువాత పంపిన లావాదేవీలు అన్నీ 10.30 కు మాత్రమే సెటిల్ చేయబతాయి. అలాగే 10.30 తరువాత పంపిన లావాదేవీలు అన్నీ 12 గంటలకు సెటిల్ చేయబతాయి. కాని RTGS లో లావాదేవీలు నిరంతరంగా సెటిల్ అవుతూ ఉంటాయి. RTGS ద్వారా మనము నగదు పంపడానికి కావలిసిన కనీస మొత్తం లక్ష రూపాయిలు. అదే NEFT ద్వారా అయితే కనీస మొత్తం అంటూ ఏమీ లేదు. ఎంతయినా మీరు పంపుకోవచ్చు. నగదు బదలీ చేయగోరేవారు బ్యాంక్ వారికి ఈ క్రింద తెలిపిన వివరాలు అందజేయవలసి ఉంటుంది.
  • పంపిచవలసిన నగదు మొత్తము.
  • డెబిట్ చేయవసిన అకౌంట్ నెంబరు.
  • నగదు చేరవలసిన బ్యాంక్ పేరు.
  • చేరవలసిన వ్యక్తి పేరు లేదా కంపెని పేరు.
  • చేరవలసిన వ్యక్తి లేదా కంపెని యొక్క అకౌంట్ నెంబరు.
  • చేరవలసిన బ్యాంక్ యొక్క IFSC కోడ్.
IFSC కోడ్ ను సంబధిత బ్యాంక్ వారిని అడిగి తెలుసుకోవచ్చు. ఇది బ్యాంక్ లో ప్రతీ శాఖకు వేర్వేరుగా ఉంటుంది. చాల బ్యాంక్ లు వారి యొక్క IFSC కోడ్ ను వారి యొక్క చెక్కు పుస్తకాల మీద ముద్రిస్తున్నాయి. ప్రస్తుతము అన్నీ బ్యాంకు శాఖలు ఈ సేవలను అందించడం లేదు. ఎ ఎ బ్యాంక్ శాఖలు ఈ సేవలను అందిస్తున్నాయో తెలుసుకోవడానికి www.rbi.org.in/scripts/bs_view RTGS.aspx ను దర్శించండి.
ఈ సేవలను మీకు అందించినందుకు గాను బ్యాంక్ వారు వసూలు చేసే ఖర్చులు (service charges) ఒకో బ్యాంక్ కు ఒకో విధంగా ఉంటాయి. బ్యాంకుల వారిగా వారు వసూలు చేసే ఖర్చుల వివరాలు తెలుసుకోవడానికి www.rbi.org.in ను దర్శించండి.
ఏదైనా కారణం చేత మీరు పంపిన నగదు మీరు పంపిన ఖాతా కు చేరని పక్షం లో మీరు పంపిన నగదు మీ ఖాతా కు తిరిగి జమ అవుతుంది. ఇద్దరికీ జమ కాని పక్షం లో మీరు మీ బ్యాంక్ శాఖ ను సంప్రదించండి. వారి యొక్క సమాధానం తో మీ సమస్య పరిష్కారం కాకపోతే మీరు క్రింద చిరునామా ను సంప్రదించండి.

NEFT

ది జనరల్ మేనేజర్
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా
నేషనల్ క్లియరింగ్ హౌస్
మొదటి అంతస్తు
నారిమన్ పాయింట్
ముంబై 400027

RTGS

చీఫ్ జనరల్ మేనేజర్
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా
కస్టమర్ సర్విస్ డిపార్టుమెంటు
మొదటి అంతస్తు , అమర్ బిల్డింగ్
ఫోర్ట్ , ముంబై - 400001.

పైన చెప్పిన రెండు పద్దతులలో ఇండియన్ రూపాయలు మాత్రమే బదలీ చేయబడతాయి . ఎ ఇతర కరన్సీ పంపబడదు.

ఎందుకింకా ఆలస్యం ఈ రోజు నుండి మీ నగదును సులభంగా బదలీ చేసుకోండి.



Thursday, October 2, 2008

ఆరోగ్యమే మహాభాగ్యం

ఈ రోజు గాంధీ జయంతి. అంటే మన జాతిపిత మహాత్మా గాంధీ పుట్టిన రోజు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని సమాజ సేవ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయినా, కనీసం సమాజానికి మేలు చేసే టపా ఒకటి రాస్తే సమాజానికి మన వంతు సేవ చేసినట్టే అని భావిస్తూ ఈ టపా వ్రాస్తున్నాను.
ఆరోగ్యమే మహాభాగ్యం. అంటే ఆరోగ్యం ఉంటే అన్ని సంపదలు ఉన్నట్టేనని అర్థం. ఆరోగ్యం లేకపొతే మహారాజు కూడా ముష్టి వాడితో సమానం అంటారు పెద్దలు. దీనినిబట్టి ఆరోగ్యానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు. కాని మన ఆరోగ్యం కోసం మనం ఎంత సమయం కేటాయిస్తున్నాం ఒక సారి ఆలోచించండి. మన దైనందిన కార్యక్రమాల్లో అతి తక్కువ సమయం మనం మన ఆరోగ్యానికి కేటాయిస్తున్నాం. మనమే కాదు మన ప్రభుత్వం కూడా అంతే. మన బడ్జెట్ లో ఆరోగ్య రంగానికి కేటాయించే నిధులు ఏంటో తెలుసా? రెండు శాతం కంటే తక్కువ. దీనిపై చాల మంది ప్రముఖులు నెత్తి, నోరు బాదుకుంటున్నా పట్టించుకొనే నాధుడు లేడు.
మన శరీరం నాగరికత పెరిగిన దగ్గర నుండి రోజు రోజుకీ అనారోగ్యం వైపు దిగజారిపోతుంది. శరీరాన్ని బాగుచేయడానికి రక రకాల వైద్య విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. కాని అందరం కోరుకొనే ఆరోగ్యం మాత్రం ఈ శరీరానికి అంది అందనట్లుగానే ఉంది. నేటి పరిస్తితి చూస్తే, వయసుతో నిమిత్తం లేకుండా, కష్టపడి పని చేసుకునేవారు, ఉద్యోగస్తులు అని బేధం లేకుండా, స్త్రీ , పురుష బేధం లేకుండా, చదువుకున్నవారు, చదువురానివారు అని లేకుండా, డాక్టర్లు, యాక్టర్లు అని బేధం లేకుండా అందర్నీ అనారోగ్యం సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. ఇక అవయవాల పనితీరు చూస్తే చిన్న చిన్న పిల్లలకే కంటి చూపు తగ్గిపోతుంది. వయస్సు తో నిమిత్తం లేకుండా కీళ్ళు అరిగిపోతున్నాయి. స్త్రీలకు అండకోశాలు ఉంటున్నాయి కాని అండోత్పత్తి సరిగా జరగడం లేడు. పురుషులకు వీర్యం ఉంటున్నది కాని అందులో పనికివచ్చే వీర్యకణాలు మాత్రం తగ్గిపోతున్నాయి. థైరాయిడ్ గ్రంధి థైరాయిడ్ హార్మోనులను ఉత్పత్తి చేయలేక పోతున్నది. పాంక్రియాస్ గ్రంధి ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోవడం వలన వయసు తో నిమిత్తం లేకుండా షుగర్ వ్యాధి వచ్చేస్తుంది. బి.పి సర్వసాధారణం అయిపోయింది. పెళ్లి కాకముందే తెల్ల జుట్టు, పిల్లలు పుట్టక ముందే బట్టతల వచ్చేస్తున్నాయి. వీటికి తోడు కండరాలు, నరాల బలహీనతలు. ఇరవై ఏళ్లకే హార్టు బ్లాకులు, హృద్రోగాలు వస్తున్నాయి. ఈ మద్యన పిల్లలు పెద్దలు తేడ లేకుండా కనిపించే సమస్య స్థూలకాయం(ఒబేసిటీ). ఇలాంటి శరీరాలతో పనిచేయించుకోలేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఉదాహరణకు, తిన్నది అరగటానికి ఒక బిళ్ళ, అరిగింది బయటకు వెళ్ళటానికి ఇంకొక బిళ్ళ , గ్యాసు బయటకు పోవడానికి మరొక బిళ్ళ, అలాగే రక్తం పట్టడానికి, మంటలకు, నొప్పులకు, నిద్రకు ఇలా ఒకోరకం బాధకు ఒకో బిళ్ళ చొప్పున మందులను ఆహారంగా తింటున్నాము. ఇలా ఎంత కాలం పాటు? ఆలోచించండి! బాగా ఆలోచించండి.
ఇలా బ్రతకటం మీకు సుఖంగా ఉందా, లేదా మీ వల్ల ఎవరికన్నా సుఖంగా ఉంటున్నదా?
మరి జీవుడు ప్రయాణించే శరీరం అనే వాహనం బాగోపోతే, దానికి వచ్చే అడ్డంకులను పూర్తిగా తొలగించుకొని తిరిగి సుఖంగా ప్రయాణించే ప్రయత్నం మనం ఎందుకు చేయకూడదు? ఈ శరీరం పూర్తిగా బాగు కాదా? మీరు ప్రయత్నించాలే కాని సాధ్యం కానిది ఏముంటుంది? మనం అవకాసం ఇవ్వాలే కాని ఈ శరీరం ఎప్పుడైనా బాగు పడడానికి సిద్దంగా ఉంది. ఈ శరీరానికి పునర్నిర్మాణం చేసుకొని తిరిగి ఆరోగ్య వంతంగా తయారయ్యే ఆవకాశం పుట్టుక నుండే ఉంది. మీరు అది చెప్పినట్టు వింటూ దానికి కావలసినవి అందజేస్తే చాలు. ఇప్పటివరకు శరీరం మీరు చెప్పినట్టు వింది. కాని ఇప్పుడు రిపేరు వచ్చింది కాబట్టి అది చెప్పినట్టు మీరు వినాలి.
సరిగా పోషణ చెయ్యక పోతే మొక్కలు వాడిపోయి, ఆకులూ రాలిపోయి, కొమ్మలు ఎండిపోతాయి. అలాంటి మొక్కలకు, నేలను సరిగా దున్ని, కలుపు మొక్కలను తీసి, ఎరువు వేసి, పుష్కలంగా నీరు పోస్తే తిరిగి చక్కగా చిగురించి, పచ్చగా కళకళ లాడుతాయి. సరయిన ఆహారాన్ని అందిస్తే మోడుగా మారిన చెట్లే చిగురిస్తుంటే, ఈ మానవ శరీరం ఎందుకు ఎందుకు చిగురించదు? ఎందుకు బాగు పడదు? మీరు మనస్పూర్తిగా తలచుకొంటే తప్పక బాగుపడుతుంది. జీవించినంత కాలం శరీరం చెప్పినట్లుగా విని దాని అవసరాలను మీరు తీర్చండి మీ అవసరాలను అది తప్పక తీరుస్తుంది. ఇచ్చి పుచ్చుకోవడం నేర్చుకోండి.
శరీరానికి మంచి గతి పట్టాలంటే మనం ఎం తిని పెట్టాలో తెలుసుకోవడానికి వచ్చే టపా వరకు వేచిచూడాల్సిందే మరి.